Header Banner

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బర్డ్ ఫ్లూ వీడియో! నిజమేమిటి? వార్తలపై అధికారులు స్పష్టత!

  Tue Feb 18, 2025 11:32        Others

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వైరస్ భయపెడుతోంది. లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ప్రభుత్వం, పశుసంవర్ధక శాఖ అధికారులు బర్డ్ ఫ్లూ వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు నమోదైన ప్రాంతాల్లో చికెన్ షాపులు మూసివేస్తూ ముందస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ అనేది పక్షులు, ఆవులు, ఇతర జంతువులలో వ్యాపించే ఓ వైరల్ ఇన్ఫెక్షన్. 2025 జనవరి నుంచి మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయి. బర్డ్ ఫ్లూ వైరస్ నియంత్రణ కోసం వ్యాధి సోకిన ప్రాంతాల్లో వైరస్‌తో చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెట్టడం వంటి పనులు చేపడుతున్నారు.


ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే! 


మరోవైపు రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు నమోదైన ప్రాంతాలను బయోసెక్యూరిటీ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. కర్నూలులోని నరసింహారావు పేట్‌లో బర్డ్ ఫ్లూ కేసును అధికారులు నిర్ధారించారు. కర్నూలు నరసింహారావు పేటలో భారీ సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. పరీక్షించిన అధికారులు బర్డ్ ఫ్లూ వైరస్ నిర్ధారించారు. అనంతరం ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందకుండా కిలోమీటర్ పరిధిలో చికెన్ షాపులను మూసివేశారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


క్లెయిమ్ ఏంటీ?
బర్డ్ ఫ్లూ వైరస్ భయాల నడుమ అనేక వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. బర్డ్ ఫ్లూ సోకిన కోడిని చూపుతున్నట్లుగా చనిపోయిన కోడి నోటి నుండి మంటలు వస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #birdflue #chicken #redallert #todaynews #flashnews #latestupdate